రెండు రాష్ట్రాల్లో బీజేపీ రోజు రోజు కి బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే రేంజ్ లో బలపడుతుందనేదే అసలు ప్రశ్న.. ఏపీ లో నూతనంగా సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టినప్పటినుంచి మంచి దూకుడుగానే వెళ్తుంది పార్టీ.. గతంలో కంటే ఎక్కువగా పార్టీ పేరు ప్రజలలోకి వెళ్తుంది.. ప్రతి చిన్న విషయంపై స్పందిస్తూ బీజేపీ పార్టీ అధికార పార్టీ పై ఒత్తిడి తేవడానికి చాలా ప్రయత్నిచింది..ముఖ్యంగా టీడీపీ వీక్ గా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.. కేంద్రంలో అధికారంలో ఉన్నా అక్కడ సపోర్ట్ సరిగ్గా లేకపోయినా రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి..