దుబ్బాక ఎన్నికలు పూర్తయిన కొన్ని రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల ప్రచారాల జోరు ఊపందుకున్నాయి.. అయితే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు షెడ్యూల్ ప్రకటించలేదు.. ఆయా పార్టీల అభ్యర్థులూ ఖరారు కాలేదు.. నామినేషన్లు దాఖలూ చేయలేదు. మరి అప్పుడే జోరుగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఏంటి అన్న ప్రశ్న రావొచ్చు.. అయితే ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ కు చెందిన ఓ నేత అప్పుడే ప్రచారానికి పూనుకుని ఈ వివాదానికి తెరలేపారు. హోరా హోరీగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో ఎవరిదీ పైచేయి సాధించిందో కొన్ని రోజుల్లోనే తెలియనుంది. ముందునుంచి అనుకున్నట్లు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ హవా నే కొనసాగింది అని చెప్పాలి..