ఏపీ లో బీజేపీ పార్టీ బలోపేతం అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నసంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే సోము వీర్రాజు నాయకత్వాన గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వినూత్న పద్ధతి లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా మారిపోతున్న బీజేపీ పై ప్రజల్లో సైతం మంచి అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా రెండు పార్టీ ల పేర్లే ఎక్కువగా వినిపించేవి.. టీడీపీ ఒకటైతే వైసీపీ రెండోది.. అయితే గత కొద్ది కాలంగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చింది. సోము వీర్రాజు బీజేపీ పార్టీ ని గతంలో కంటే దూకుడు గా వ్యవహరిస్తుందని చెప్పాలి.