ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చేసిన చివరి సీఎం ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పొచ్చు.. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పలువురు ఏపీ కి ముఖ్యమంత్రి గా పనిచేశారు.. రోశయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తన బాధ్యతలు ఎంతో సక్రమంగా నిర్వర్తించారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ విడిపోయిన ఏపీ లో ఎంతటి దారుణమైన స్థితికి పోయిందో అందరికి తెలిసిందే.. పోనీ తెలంగాణ లో అయినా కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందా అనుకుంటే అక్కడ బీజేపీ రాకతో మరింత వీక్ అయిపొయింది.. దాంతో కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో బలం లేకుండా పోయింది.. అసలు ఏపీ లో అయితే కాంగ్రెస్ పేరెత్తితే మండిపడిపోతున్నారు ప్రజలు..