నిమ్మగడ్డ తాను పట్టిన కుందేలుకు రెండు కాళ్ళు అన్న రీతి లో వ్యవహరించడంతో అధికారంలో ఉన్న పార్టీ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు.. రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లు నిమ్మగడ్డ వ్యవహారం రోజు కో కొత్త తలనొప్పిని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు..స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది. కానీ చివరి నిమిషంలో సుప్రీం కోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు నిమ్మగడ్డ. అయితే వచ్చాక అయినా మారతాడు అనుకుంటే గతంలో కంటే ఎక్కువగా వైసీపీ పై పగ పెంచుకున్నాడు..