భారత ప్రధాని మోడీ కి ఇప్పటివరకు ఎదురులేదు.. బీజేపీ పార్టీ లో సైతం మోడీ కి ఎదురుచెప్పే సాహసం ఎవరు చేయరు.. గుజరాత్ సీఎం గా ఉన్నప్పటి నుంచి ప్రధాని అయ్యే వరకు మోడీ ఎంతలా పనిచేసి ఉంటారో అందరు అర్థం చేసుకోవచ్చు.. వరుసగా రెండో సారి మోడీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు.. అయితే మొదటి సారి మంచి పేరు దక్కించుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చిన మోడీ రెండో సారి మాత్రం ప్రజలకు ఇబ్బంది కలిగేలా పాలనా కొనసాగిస్తుండడం చర్చనీయాంశమైంది.. దేశంలో ఎన్నో చిక్కుముడులను విప్పిన మోడీ ఈ సారి మాత్రం ప్రజలను ఇబ్బందిపెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..