అధికారంలో ఉన్న పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా కొంతమంది నేతలకు ఎంత సంధి చేద్దామని ప్రయత్నించినా వారి మధ్య తాత్కాలిక బంధమే తప్ప శాశ్వత పరిష్కారంమాత్రం ఉండదు.. అందుకు చాలా కారణాలే ఉన్నా ముఖ్యంగా ఇగో అనే ఫాక్టర్ వారి మధ్య చిచ్చుకు కారణమవుతుంది.. ఇక అధికారంలో అనే ఆ ఫాక్టర్ కొంత ఎక్కువే ఉంటుంది.. మంత్రి అయితే దానికి సమాధానం చెప్పలేం.. అయితే ఇద్దరు మంత్రులు అయితే వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడుతుంది.. అలానే వైసీపీ లో ఇద్దరు మంత్రుల మధ్య ఎప్పటినుంచి రగులుతున్న వివాదం ఇప్పుడు మీడియా ముందు మరొక సారి బయటపడింది..