ఏపీ లో టీడీపీ పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే.. చంద్రబాబు రాజకీయాలకు రిటైమెంట్ ప్రకటించెటప్పుడే టీడీపీ పార్టీ కూడా రిటైమెంట్ ప్రకటిస్తే మంచిది..లేదంటే డిపాజిట్లు కూడా రాకుండా దశాబ్దాలుగా ఉన్న పార్టీ పరువు పోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏపీ లో టీడీపీ పరిస్థితి ఇలా ఉంటె తెలంగాణ లో టీడీపీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్లుగానే తెలుస్తుంది.. తెలంగాణాలో ఎన్నికల జోరు ఊపందుకుంది.. ఇప్పటికే దుబ్బాక ఎన్నికలు పూర్తి అవగా టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు అక్కడ హోరాహోరీగా తలపడ్డాయి.. ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం.. ఇప్పుడు కూడా లేదు కానీ ప్రతిపక్షాలు తామంటే తాము టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్తూ గులాబీ నేతలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది..