ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ లీడర్ ముఖ్యమంత్రి అయినా అందర్నీ విమర్శిస్తూ రాష్ట్రాన్ని సక్రమంగా తీసుకెళ్లడంలో కొంత పాత్ర వహిస్తుంటారు కొందరు.. వీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పాలనా పార్టీ తరపున మాట్లాడారు.. ప్రజల తరపున మాట్లాడతారు.. ప్రభుత్వం ఎవరిదైనా తప్పు జరిగితే విమర్శించి మంచి జరిగేలా చూస్తుంటారు.. రాజకీయ పార్టీలు, ప్రజలు, తటస్థులైన రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు.ప్రజా స్వామ్య మనుగడకు విమర్శలే ప్రాణం అనే మాట వింటుంటాం. ప్రభుత్వాలు కూడా విమర్శలు సహించలేకపోతే.. వారి పరిపాలన సజావుగా సాగదంటారు. అయితే ఇలా సమాజానికి తెలియకుండా సమాజ బాగు కొరకు కృషి చేసే వారు ఏపీ లో చాలామంది ఉన్నారు.. అందులో ఒక్కరు ఉండవల్లి అరుణ్ కుమార్..