రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా వైసీపీ లో వర్గ విభేదాలు రోజు రోజు కి ఎక్కువయిపోతున్నాయి.. ముఖ్యంగా వైసీపీ కొంత బలహీనంగా ఉన్న చోట పార్టీ ప్రతిష్ట ని దెబ్బతీసే విధంగా నేతలు ఎలాంటి సాహసాన్నైనా చేస్తున్నారు.. పార్టీ లోని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్న లెక్క చేయకుండా తమ స్వార్ధం కోసం పార్టీ ని వాడుకుని ప్రతిష్టని దిగజార్చుతున్నారు.. టీడీపీ లో వర్గ పోరే ఈ దుస్థితి కి కారణమని తెలిసినా పార్టీ లో ఇలా జరగడం కొంత ఆందోళనను గురిచేస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఇక ప్రజలే తమ నియోజక వర్గంలోని నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు.. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని తాడికొండ ఈ ప్రభావం ఎక్కువగా ఉంది..