అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ కొంతమంది చేరి భజన చేస్తారు.. ఉన్నది లేనిది చెప్పి ఆ నాయకుడిని ఆకాశానికి ఎత్తుతారు. దీంతో తనకన్నా తోపు ఎవడు లేడని సహజంగానే ఏ నాయకుడైన అనుకుంటాడు.అయితే టీడీపీ విషయంలో ఇది కాస్త ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు.. నిజానికి ముందునుంచి చంద్రబాబు పొగడ్తలకు లోంగే మనిషి.. ఎవరైనా పొగిడితే తన వెంట పెట్టుకుని అందాలన్నీ ఎక్కిస్తాడు. పొరపాటున విమర్శిస్తే తన పార్టీ లో చోటు ఇవ్వడు.. ఇది చాలా సార్లు నిరూపితమైంది. గత హయాంలో టీడీపీ లో ఇలాంటి వారు చేయబట్టే పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది..