మొన్న జరిగిన దుబ్బాక ఎన్నిక ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అందరికి తెలిసిందే.. తెరాస పార్టీ కి వన్ సైడ్ అవుతుందనుకున్నారు అంతా కానీ బీజేపీ ఎంట్రీ తో ఈ రెండు పార్టీ లమధ్య పోరు ఎంతో ఆసక్తి కరంగా మారిపోయింది. ఈ రెండు పార్టీ లు దుబ్బాక ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా హోరాహోరీగా ప్రచారాల్లో పోటీపడ్డాయి. ఇక కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన శక్తి కి మేర ప్రయత్నించిందని చెప్పొచ్చు.. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ లో ఉన్న చెరకు శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి ఊహించని విధంగా ఆయనకు టికెట్ ఇచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసింది. అయితే కాంగ్రెస్ లో ఏది జరిగినా నువ్వా - నేనా అంటూ సాగిన దుబ్బాక రేసులో టీఆర్ఎస్ - బీజేపీ మధ్యే తీవ్ర పోటీ నడిచినట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.