బీజేపీ పార్టీ తెలంగాణ లో అంచలంచెలుగా ఎదుగుతుంది అని చెప్పడానికి ఉదాహరణ నాలుగు ఎంపీ సీట్లే కాదు, జనాల మద్దతు కూడా అని చెప్పాలి..దుబ్బాక లో అధికార పార్టీ ని నిలువరించింది అంటే బీజేపీ ఏ రేంజ్ లో ఇక్కడ ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ని సైతం పక్కన పెట్టి బీజేపీ కేసీఆర్ ని విమర్శించడం వారి తప్పులను ఎత్తి చూపడంతో బీజేపీ కి ప్రజల మద్దతు దక్కుతుంది. ఇప్పటికే దుబ్బాక లో ఓట్లను చీల్చడంలో బీజేపీ ప్రముఖ పాత్ర వహించి అధికార పార్టీ ని దెబ్బ తీసే విధంగా చేసింది. కాగా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా అధికార టీఆరెస్ పార్టీ ని నిలువరించేందుకు ఓ కొత్త అస్త్రాన్ని తయారు చేసింది బీజేపీ.