జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపొయింది..గతంలో ఏ పార్టీ కూడా కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ బంపర్ మెజారిటీ తో గెలిచింది.అప్పటికే ఎంతో ప్రజాభినం ఉన్న టీడీపీ ని కాదని ప్రజలు జగన్ ని గెలిపించారు.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపటినుంచి జగన్ ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే.. అందుకు తగ్గట్లే అయన పాలన కూడా ఉంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న జగన్ గురించి ఆయన శైలి, దూకుడు స్వభావం అందరికి అర్థమైపోయి ఉంటాయి..మూడు రాజధానుల అంశంపై న మొదట్లో తన సన్నిహిత నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినా ఆయన మాత్రం తొణకకుండా అదే పంథాలో వెళ్లారు ఫలితంగా మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుంది.