2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కినా సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ వైపు మొగ్గి ఆయనపై నమ్మకం ఉంచారు..151 సీట్ల మెజారిటీ తో వైసీపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. గత ఎన్నికల సమయంలోనూ మంచి బలం ఉన్నా టీడీపీ పార్టీ ని ప్రజలు అందలమెకించారు.. కానీ టీడీపీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా రాష్ట్రాన్ని దుర్భరం చేసింది..అంతేకాదు నీతి లేకుండా వ్యవహరించింది. ఎంతో కష్ట్రపడి జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థి ని తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేయడం తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను మాయమాటలు చెప్పి చంద్రబాబు బుట్టలో వేసుకుని తన పార్టీ లో చేర్చుకోవడం..