ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయ పార్టీల కంటే ముందు కులాల పెత్తనంతో అధికారం కోసం పోటీ జరుగుతూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం జరిగాక కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యానికి గండి పడింది. ఒక దఫా టీడీపీ అధికారంలోకి వస్తే మరో దఫా కాంగ్రెస్ వచ్చేది ఇలా రెండు పార్టీలు అధికారం పంచుకోవడం అనవాయితీగా మారింది. ఇక చంద్రబాబు జమానాలో పదేళ్ళ పాటు టీడీపీ అధికారం దక్కించుకుంటే కాంగ్రెస్ కూడా పదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీని ఏలింది.


విభజనతో చేటు :


ఇక అనూహ్యంగా ఉమ్మడి ఏపీ రెండు ముక్కలైంది. 2014 తరువాత తెలంగాణా నవ్యాంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పాటు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోవడం వెనక రాజకీయ కారణాలతో పాటు సామజిక కారణాలు కూడా ఉన్నాయని అంటారు. 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ఉన్నపుడు రెడ్లది సామజికవర్గంగా కూడా బలమైన పరిస్థితి. అదే 13 జిల్లాలుగా విడిపోయిన ఏపీలో రెడ్ల బలం సగానికి సగం తగ్గిపోయిందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దాంతో పాటు కమ్మ ఆధిపత్యం పెరగడానికి కూడా ఈ విభజన ఉపయోగపడిందని చెబుతారు.


సీమకే పరిమితం :


విభజన ఏపీలో రెడ్ల పరిస్థితి  రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించేలాగే కనిపిస్తోంది. రాయలసీమ నాలుగు జిల్లాలకే వారు పరిమితం అయ్యారని లెక్కలు చెబుతున్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత బేస్ ఉంది. మిగిలిన ఏడు జిల్లాలైన  కోస్తా, ఉత్తరాంధ్రల్లో  రెడ్లది నామమాత్రపు ఉనికి మాత్రమే. దాంతో రాజకీయంగా వారి ఆధిపత్యానికి విభజన పెద్ద అవరోధంగా మారిందని అంటారు.


విస్తరించిన కమ్మలు :


అదే టైంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం బాగానే విస్తరించింది. కోస్తాలో బలంగా ఉన్న ఆ వర్గం, సీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాలో బాగానే ఉనికి చాటుకుంటున్నారు. ప్రకాశం జిల్లతో పాటు, ఉభయ‌గోదావరి, ఉత్తరాంధ్రలోనూ వారు  రాజకీయంగా బలమైన ఉనికిని చాటుకుంటున్నారు. ఈనేపధ్యం  నుంచి చూసినపుడు విభజన వల్ల ఏపీల సామాజిక పరిస్థిల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పుకోవాలి.


పొత్తు కుదిరేనా :


వాస్తవ పరిస్థితిని బట్టి ఏపీలో రాజకీయంగా చూసుకుంటే రెడ్లు బలంగా ఉన్నప్పటికీ టీడీపీని సవాల్ చేసే పరిస్థితిలో ఉన్నారా అన్నది చూడాలి. ఈ టైంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు అన్నది వెలుగులోకి వచ్చింది. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే టీడీపీతో కలవక తప్పదని కాంగ్రెస్ భావిస్తున్న వేళ అందులో దశాబ్దాల తరబడి పనిచేసిన రెడ్ల ఆలోచన ఏమిటన్నది చూడాలి.
 ఆ లెక్కలు కనుక సరిపోతేనే రేపటి రోజున ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పూర్తిగా విజయవంతం అయ్యేది. లేకపోతే వారు రెడ్ల పార్టీగా పేరున్న వైసీపీ వైపునకు మళ్ళి కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: