ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోందట. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే దారుణంగా ఇప్పుడు జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారట. ప్రత్యేకించి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారట. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలను బతకనీయడం లేదట. ఇవన్నీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు.


ఆయన వైసీపీ బాధిత కుటుంబాల కోసం గుంటూరు ఆరండల్ పేటలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు. పలనాడు ప్రాంతం నుంచి వచ్చిన వైసీపీ బాధితులతో మాట్లాడారు.. ఆయన ఇంకా ఏమంటున్నారంటే...


" ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి ని హెచ్చరిస్తున్నా.. పల్నాడు ను మరో పులివెందుల పంచాయతీ చేస్తామంటే సహించేది లేదు.. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు బాధ్యత తీసుకోవాలి.. బాధ్యతల నుంచి పారిపోవాలని పోలీసులు చూస్తే ఊరుకునేది లేదు.. బాధితులను వెంట తీసుకుని నేనే ఊరులోకి వస్తా.. ధైర్యం ఉంటే నాపై దాడి చేయండి.. మీకు బలమున్న చోట మీరు దాడులు చేస్తే..., మాకు బలమున్న చోట మేము చేయలేమా..


తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేస్తే మీకున్న జైళ్లు సరిపోవు... బాధిత ఊళ్లలో నేనే ఉంటా....తాడోపేడో తేల్చుకుందాం!.. ఇదేమీ మీ తాత జాగీరు కాదు... నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటారు కానీ జగన్ కు ఊడిగం చేయటానికి కాదు... చట్టాన్ని గౌరవించకుంటే పోలీసుల్ని బాధ్యుల్ని చేస్తూ ప్రయివేటు కేసులు వేస్తాం.. దీనిపై సుప్రీంకోర్టు వరకు అయినా వెళతాం.. వై.ఎస్. కంటే దారుణంగా జగన్ వ్యవహరిస్తున్నారు..


వైసీపీ దాడులతో వలస వెళ్లిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10వేలు తక్షణ ఆర్థిక సాయం ఇస్తాం.. తప్పుడు కేసులు ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం... పోలీసులు ఈ నెల 10వ తేదీ లోగా బాధితుల్ని తమ గ్రామాలకు తీసుకెళ్లాలి... లేదా 11వ తేదీ నుంచి నేనే తీసుకెళ్తా... 11వ తేదీన తొలుత ఆత్మకూరు బాధితుల్ని తీసుకెళ్తా... అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: