వైసీపీ నేతల ఆగడాలతో తెలుగు దేశం కార్యకర్తలను బతకీయడం లేదంటూ తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఆందోళన కొత్త మలుపులు తిరుగుతోంది. సమస్య పరిష్కారానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తీరు చూస్తే పలనాడు ప్రాంతం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదేమో అన్న అనుమానం కలుగుతోందని కొందరు అధికారులు కామెంట్ చేస్తున్నారు.


తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న వైసీపీ బాధితుల శిబిరంలోని కార్యకర్తలను వారి గ్రామాలకు తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను తెలుగు దేశం ఫలించనీయడం లేదన్న వాదన వినిపిస్తోంది. బాధితులను తీసుకెళ్లేందుకు పోలీసులు వచ్చినా.. తెలుగు దేశం నేతలు మాత్రం కొత్త కొర్రీలు వేస్తున్నట్టు తెలుస్తోంది. బాధితుల్ని వాహనాల్లో తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని... వాళ్లే ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అదనపు ఎస్పీ చక్రవర్తి మీడియాకు వెల్లడించారు.


బాధితులు గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైతే... పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని చక్రవర్తి భరోసా ఇచ్చారు. అయితే తాము వారిని బలవంతంగా మాత్రం గ్రామాలకు తరలించబోమన్నారు. శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నామన్నారు. స్థానిక పోలీసులు వేధిస్తున్నట్లు ఎవరైనా రాతపూర్వకంగా కంప్లయింట్ చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


అయితే ఇదే సమయంలో అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు... పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. పల్నాడు వ్యవహారంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పల్నాడులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బాధితులున్నారని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. అంటే సమస్యను పలనాడుకు పరిమితం చేయకుండా.. పరిష్కారం కాకుండా ఆయన మెలికలు పెడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారిని పంపించి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చూస్తే.. ఏదో ఒక సాకు చూపించి.. బాధితుల తరలింపును అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: