వైసీపీ పాలనపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు రోజూ విరుచుకుపడుతున్నారు. రాష్ట్రాన్ని జగన్ తుగ్లక్ లా పాలిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించింది. గ్రామ సచివాలయాలు ప్రారంభిస్తున్న వేళ.. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.


ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్నలు ఇవే..

1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ ప్రారంభిస్తున్నందుకు టీడీపీ సంతోషించకపోగా.. బాధపడుతోందా..?

2) గడిచిన మీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు జన్మభూమి కమిటీ వ్యవస్ధ ద్వారా మీరు చేసిన అరాచకాలు-దోపిడీలను కప్పిపుచ్చుకునేందుకే చివరికి గ్రామ వాలంటీర్ల వ్యవస్ధను కూడా విమర్శిస్తున్నారా..?

3) గ్రామ సచివాలయాలపై మీ స్టాండ్ ఏంటి చంద్రబాబు గారూ.. ?

4) 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు, ప్రతీ 2వేల జనాభాకు 10 మందిని కేటాయించినందుకు మీరు సంతోషపడుతున్నారా లేక బాధపడుతున్నారా?


5) గ్రామ వాలంటీర్ల ఎంపిక కూడా అత్యంత నిష్పాక్షికంగా జరిగిందని ఏ గ్రామంలో అడిగినా చెప్తారు. 1.34 లక్షల మందికి ఒకే రోజున ఉద్యోగాలివ్వడం దేశచరిత్రలో

ఎప్పుడైనా చూశారా? మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కల అయినా కన్నారా..?

6) మీరు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మీ జీవితంలో ఎప్పుడైనా 10వేల మందికి ఉద్యోగాలిచ్చారా.. ? కనీసం 1000 మందికైనా ఇచ్చారా..?

7) మీరు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల లోపు ఎప్పుడైనా ఉద్యోగాలు రిక్రూట్ చేశారా?

8) గ్రామాల్లోనే ఇళ్లపట్టాలిచ్చే వ్యవస్ధను ఎప్పుడైనా ఏర్పాటు చేశారా?

9) గ్రామాల్లోనే ఎరువులు, పురుగుమందులు.. అవీ ప్రభుత్వం ధృవీకరించినవి అమ్మే ఏర్పాటు ఎప్పుడైనా చూశారా?

10) గ్రామాల్లోనే మహిళా పోలీస్ వ్యవస్ధను ఎప్పుడైనా ఏర్పాటు చేశారా?



11) గ్రామసచివాలయం ద్వారా దాదాపు 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 500 పనులు అక్కడికక్కడే ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. మీ 14 యేళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా ?

12) మన మండలంలోనే మనకు ఉద్యోగాలొస్తున్నాయంటే.. మళ్ళీ గ్రామాలు బ్రతుకుతాయి.. అక్కడి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇటువంటి ఆలోచన మీరు ఎప్పుడైనా చేశారా ?

13) 2004 కు ముందు 9 యేళ్లు పరిపాలించి.. గ్రామాలన్నీఖాళీ అవడానికి కారణం మీరు కాదా ?

14) గ్రామాల్లో ఎక్కువ కరెంటు కోతలు, ఉచిత విద్యుత్ ఎట్టి పరిస్ధితుల్లో ఇచ్చేది లేదన్నమీ స్టేట్ మెంట్, కరెంటు బకాయిలున్న రైతులపై కేసులు పెట్టి ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టిన చరిత్ర మీది కాదా..?

15) 2014-18 మధ్య రుణమాఫీ చేయకుండా వ్యవసాయాన్ని చావుదెబ్బ కొట్టారు. బంగారాన్ని విడిపించలేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వ లేదు. భీమా ఇవ్వలేదు. ధరలస్ధిరీకరణ లేదు. ప్రకృతి విపత్తు నిధీ లేదు. చివరకు అధికారంలోకి రాగానే పించన్లు, రేషన్ కార్డులను పార్టీల వారీగా విభజించి 10 లక్షల చొప్పున తొలగించింది మీరు కాదా..? మరి ఈ ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా..? 


మరింత సమాచారం తెలుసుకోండి: