చింతమనేని  ప్రభాకర్. ఈ పేరు వింటే చాలు వనజాక్షి ఉదంతం, ఇసుక దందాలు గుర్తుకువస్తాయి. చింతమనేని అనుచరులు అప్పట్లో ఈ విధంగా చేశారని ప్రచారం జరిగింది. ఆ తరువాత కూడా చింతమనేని అనేక వివాదాల్లో నలిగారు. అయితే అధికార పార్టీ అండదండలు దండీగా ఉండడంతో చింతమనేఅని హవా బాగా సాగింది. మరి ఇపుడు వైసీపీ సర్కార్ వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు, కానీ చింతమనేని రెండు నెలలు జైలు జీవితం అనుభవించారు. బెయిల్  మీద వచ్చిన చింతమనేని ఇపుడు ఏం చేద్దామంకుంటున్నారు అన్నది సస్పెస్న్ గా ఉంది.


ఏపీ రాజకీయాలు చూస్తే బాగా మారిపోయాయి. టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం మనుగడ ప్రతిపక్షంగా కష్టసాధ్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో అనేక మంది టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఒకనాడు జగన్ని అనరాని మాటలు అన్న వల్లభనేని వంశీ ఇపుడు వైసీపీలో చేరేందుకు సిధ్ధంగా ఉన్నారు. ఈ రోజు బెయిల్ మీద వచ్చిన చింతమనేని మీద కూడా ఈ నేపధ్యంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.


చింతమనేని బయాటకు వచ్చి టీడీపీకి పెద్ద దిక్కుగా నిలబడి వైసీపీ మీద తిరగబడతారు అని అంతా ఊహిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలనుకుంటున్నారుట. క్యాడర్ కి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన చింతమనేని పరిస్థితులు బాగులేవు అంటున్నారుట. ఇక చింతమనేని జైలు లో ఉన్నపుడు వల్లభనేని వంశీ వెళ్ళి ఆయనను కలసి వచ్చారు. మరి ఆ తరువాతనే వంశీ టీడీపీ వీడారు.


దీన్ని బట్టి చూస్తూంటే చింతమనేని  కూడా తొందరలోనే టీడీపీని వీడుతారని అంటున్నారు. చింతమనేని ఇప్పటికే బాగా నలిగిపోయారని అంటున్నారు. ఆయన రాజకీయ జీవితం సంగతి పక్కనపెట్టి ప్రశాంతంగా ఉండాలన్నా కూడా వైసీపీకి జై అనడమే ఉత్తమమని అంటున్నారు. మొత్తానికి దేవినేని ఫ్యామిలీ వైసీపీలో చేరింది. వల్లభనేని జై కొట్టేసారు. ఇపుడు చింతమనేని కూడా వైసీపీలోకి వెళ్ళిపోతే టీడీపీ దారుణంగా దెబ్బతినాల్సివస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: