75 రోజుల పాటు ఎవ్వరికి కనబడకుండా అజ్ఞాతంలో ఉన్న అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌ శుక్రవారం రాజమండ్రి వెళ్లారు. ఆయన వెళ్లిన కాసేపటికే ఆయనను త్రిటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో అయన జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసు నేపథ్యంలోనే ఆయన ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఎంపీ హర్ష కుమార్‌ పై 353, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పోలీసు కేసుల నేపథ్యంలో కొన్ని నెలలుగా హర్షకుమార్ అజ్ఞాతంలో ఉన్నారు.
 

మొదట హర్ష కుమార్ కి వైద్యపరీక్షలు నిర్వహించి, అనంతరం పోలీసులు మాజీ ఎంపీని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేసును పరిశీలించిన జడ్జి హర్ష కుమార్‌ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో మాజీ ఎంపీని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.


పోలీసుల తీరు పై హర్ష కుమార్, ఆయన అనుచరులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా.. తనపై ఎందుకింత కసి అని గతంలో ప్రశ్నించిన హర్ష కుమార్.. చివరకు ఎయిర్‌ పోర్టులను కూడా వదలడం లేదని మండిపడ్డారు. 


353, 354 సెక్షన్ల కింద కేసు పెట్టిన ఎంత మంది గురించి విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారో చెప్పగలరా..? అని ఆయన ఏపీ డీజీపీ ని ప్రశ్నించారు. కనీసం  ఇలాంటి కేసు ఒక్కటైనా ఉందేమో చెప్పగలరా అని నిలదీశారు. హర్ష కుమార్ గత కొద్ది రోజుల పాటు తెలంగాణ లో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల హత్యాచారానికి గురై న సమత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. గురువారమే ఓ ఫంక్షన్‌ కు హాజరైన ఫొటోలను సైతం సోషల్ మీడియా లో పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: