ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రజాసంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఎజెండాను ముందుకు నడిపిస్తూ... నేటితరం ఆలోచనలతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీలను వెంటనే ఆరు నెలల పాలనలోనే ఎన్నో నెరవేర్చారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఓ హామీని మరిచినట్టు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసినప్పటికీ ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు.
ఇంతకీ ఆ హామీ ఏమిటి అనుకుంటున్నారా... 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని తొలిసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పార్టీ స్థాపించినప్పటి నుంచి తండ్రి ఆశయాలను ద్యేయలను ముందుకు నడిపిస్తూ వైసిపి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సాయశక్తులా కృషి చేసారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన తర్వాత ఈ ఏడాది మే 30న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకరం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన తొలి సంతకం ఇప్పటి వరకు అమలు కాలేదు.
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పెన్షన్ల లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే వైయస్సార్ పెన్షన్ కానుక ఫైలు మీద సంతకం కూడా చేశారు. అయితే ఈ పథకం విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఇప్పటి వరకు 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ లు మాత్రం అందడం లేదు. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇచ్చిన హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదు అని తెలుస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్సార్ పెన్షన్ కానుక హామీ నెరవేర్చే పని లో వైసీపీ ప్రభుత్వం ఉండొచ్చు అని పలువురు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి