ఏపీ రాజధాని సమగ్ర అభివృద్ధి కోసం సిఫార్సులు చేసేందుకు సర్కారు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.. ఆ విషయంపై సమగ్రమైన నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూస్తే ఏపీ ప్రజలకు ఇన్నాళ్లూ మాజీ సీఎం చంద్రబాబు వైఫల్యాలు ఏంటో పూసగుచ్చినట్టు అర్థమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. అసలే విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రం.. అందులోనూ లోటు బడ్జెట్ తో ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రం.
మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబాటు ప్రాంతాలు ఉన్న రాష్ట్రం.. ఇలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే.. కొత్త ప్రాజెక్టులు కట్టాలి. ప్రజల జీవన ప్రమాణం పెంచాలి. కరువు తీర్చాలి.. ఇలాంటి పనులకే కోట్లకు కోట్లు నిధులు అవసరం. కానీ చంద్రబాబు సర్కారు వాటిని పట్టించుకోకుండా.. తన కలల రాజధాని అన్నపేరుతో ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే అమరావతి ప్రాజెక్టును ప్రారంభించారు.
సరే.. ఏదో గొప్ప నగరం కట్టాలనుకున్నారు..ఓకే.. అందు కోసం కల కన్నారు.. ఓకే.. మరి కేంద్రం నుంచి ఏమైనా నిధులు రాబట్టారా అంటే అదీ లేదు. లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో దోస్తీ చేసి సాధించింది కేవలం 1500 కోట్ల రూపాయలు. ఈ నిధులు లెక్కప్రకారం అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం ఒక్కశాతం మాత్రమే సరిపోతాయి.
అంటే చంద్రబాబు తలకు మించిన భారం పెట్టుకున్నారనేగా.. రాష్ట్రం ఆర్థిక స్థితిగతులు పట్టించుకోకుండా.. వెనుకబడిన ప్రాంతాల గోడు పట్టించుకోకుండా కేవలం అమరావతిపైనే చంద్రబాబు దృష్టి సారించారన్నమాట. పోనీ అదైనా సాధించారా అంటే అదీ లేదు. ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్లు వెచ్చించి నాలుగు తాత్కాలిక భవనాలు మాత్రం కట్టారు. అంతకుమించి అడుగు ముందుకు పడలేదు. ఇలా ఒకటా రెండా చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో చేసిన వైఫల్యాలు.. ఇప్పుడు బోస్టన్ నివేదిక కూడా అక్షరాలా ఇదే చెప్పింది. గ్రీన్ ఫీల్డ్ నగరాలు ఎక్కడా విజయవంతం కాలేదని.. అవి గుది బండలుగానే మారాయని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి