ఈ నెల 22న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి . ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం అంటూ అన్ని పార్టీలు ధీమాతో ముందుకు సాగుతున్నాయి. ఇక ప్రచార రంగంలోకి దిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అందరూ... ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అటు ఖర్చు కూడా భారీగానే పెడుతున్నట్లు సమాచారం. విజయం వస్తే చాలు ఎంత ఖర్చు అయితే ఏమిటి అన్నట్లుగా భారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఖర్చులు పెడుతున్నారట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. అంతేకాకుండా తమ తమ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటరు ఆకర్షిస్తున్నారు. 

 

 

 అంతేకాకుండా పార్టీలోని ముఖ్య నేతలందరినీ ప్రచార రంగంలోకి దింపుతున్నారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఇక పార్టీ ముఖ్య నేతలు కూడా తమ తమ ప్రసంగాలతో ఇతర పార్టీల తీరును ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఏకపక్షంగా అభ్యర్థుల ఎన్నిక జరగ్గా..  కొన్ని చోట్ల మాత్రం భారీ పోటీ నెలకొంది. అన్ని పార్టీల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు తమదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక సమయం కూడా కొంచమే ఉండటంతో... ఉన్న కొంచెం సమయంలోనే ఓటర్లను ఆకర్షించడంలో ఎలా అనే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. 

 

 

 అయితే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఎల్లుండి సెలవు ప్రకటించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఓటర్లుగా ఉన్న స్థానికేతరులు అయిన పబ్లిక్,  అండర్ టేకింగ్, కమర్షియల్,  ఇండస్ట్రియల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు... కార్మికులకు ఈ నెల 22న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఉద్యోగులు కార్మికులు పనిచేసే సంస్థలు స్థానికంగా ఉండి ఓటు హక్కు  కూడా స్థానికంగా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా మూడు గంటల సమయాన్ని ఇవ్వాలని సూచించింది. కాగా  ఇప్పటికే  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: