నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్ లో దేశ ఆర్ధిక ప్రగతి కోసం కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు నిధులను కేటాయించారు.  అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ను కేటాయించడం విశేషం.  ముఖ్యంగా మహిళా సాధికారికతను పెంపొందించే విధంగా బడ్జెట్ ను రూపొందించింది నిర్మలా సీతారామన్. 

 


ఇక ఇదిలా ఉంటె, ఈ బడ్జెట్ లో మహిళలు, శిశువుల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చారు.  మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ. 28,600 కోట్లు కేటాయించారు.  దేశంలో మహిళలు, శిశువులు పౌష్టికాహారం లోపం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  వేలాదిమంది మహిళలు సరైన ఆహరం దొరక్క ఎన్నో బాధలు పడుతున్న సంగతి తెలిసిందే.  పిల్లలు మరణించడానికి కూడా ఇదొక కారణంగా చెప్పొచ్చు.  

 


ఇక ఇదిలా ఉంటె, పాఠశాలల్లో చదువుకునే పిల్లల్లో ఈ లోపం అధికంగా కనిపిస్తోంది.  పాఠశాలల్లో చదువుకునే చిన్నారుల కోసం కేంద్రం రూ. 35,600 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. బాలికలు స్కూల్ స్టేజి నుంచి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అలాంటి వారికి మంచి పౌష్టికాహారం అందిస్తే మరింత చురుగ్గా మారతారని, వారికి అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది.  అందుకే చిన్నారుల కోసం ఈ బడ్జెట్ లో అదనంగా నిధులు కేటాయించారు.  

 


ఇక పొతే, గతంలో ప్రధాని మోడీ భేటీ బచావో భేటీ పడావో పధకం ద్వారా ఆడపిల్లలను ఆదుకోవాలని, ఆడపిల్లలు చదువుకోవాలని, వారి చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.  ప్రభుత్వం చెప్పినట్టుగానే గతంతో పోలిస్తే చదువుకునే ఆడపిల్లల సంఖ్య పెరిగింది.  భవిష్యత్తులో కూడా ఆడపిల్లలు ఇలానే చదువుకోవాలనే లక్ష్యంతో పిల్లల కోసం ఈ ఏర్పాట్లు చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: