స్త్రీలని చులకనగా చూడడం, ఏమీ తెలియదు అని కట్టేయడం, వెనుకబడిపోయి, బతుకుపై ఆశలు వదిలేసుకుంది బతికారు కొందరు. కానీ అప్పటి కాలంలో కూడా ఎందరో మంది స్త్రీలు రాణించారు. ఆనాడు కలం పట్టిన వారు, గళం ఎత్తిన వారు, కత్తి పట్టిన వారు, యుద్ధం చేసిన వారు, సేవ చేసినవారు, దేశాన్ని రక్షించినవారు కూడా ఉన్నారు. ఆనాటి స్త్రీలు నేటికీ ఆదర్శమే. వాళ్ళు చేసినది ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నిసార్లు తలచుకున్నా ఎంతో తక్కువ. అయితే దేశం కోసం బతికి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్న వారిలో మన ఇందిరా ప్రియదర్శిని ఒకరు.

 

IHG

 

1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయాలు మరియు 1980లో మరో పర్యాయంలో ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధి పని చేసింది. తొలి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ ఏకైక కుమార్తె ఈమె.1964 సంవత్సరములో తన తండ్రి మరణించాక ఈమె రాజ్యసభ ఎన్నికల్లో ఎంపిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. స్వాతంత్ర్యంపై గాంధీ, నెహ్రూ మాట్లాడుకుంటే చిన్నారి ఇందిరకి ఏమి అర్ధం కాలేదు. కానీ చివరన తన బొమ్మలని కూడా వదిలేసింది. అప్పటి నుండి కూడ తన దేశంపై ఆమెకి అమితమైన ప్రేమ ఉంది.

 

IHG

 

1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అప్పుడు గాంధీ, నెహ్రు కూడా విడుదల అవ్వడం మళ్ళీ జైలుకి వెళ్ళడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకసారి ఈమె కూడ జైలుకి వెళ్ళింది. ఆ జైల్లో ఉన్నప్పుడే తనకి కొడుకు పుట్టాడు. అతనికి రాజీవ్ అని పేరు పెట్టింది. విడుదల అయ్యి లోపలికి వెళ్ళే తీరులో ఆమెకి జాతీయభావం అధికంగా పెరిగింది. దేశం కోసం పని చెయ్యాలన్న తపన ఎక్కువైంది. 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారత రత్నను  పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది. 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది ఇందిరా గాంధీకి.

మరింత సమాచారం తెలుసుకోండి: