రాను రాను మధ్యప్రదేశ్ రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్ మారాయి. కమలం, హస్తం నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తునే ఉంది. తాజాగా కమలం నేతలను డిఫెన్స్ పడేసేందుకు సంచలన వ్యాఖ్యాలు చేశారు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్. బెంగళూరులో ఉన్న రెబల్స్ అందరూ తనతో ఫోన్ లో టచ్ లోనే ఉన్నారని... అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామని ధీమాగా చెప్పారు. ఒకవేళ వారు బీజేపీకి ఫేవర్ గా ఉంటే..తనతో ఎందుకు టచ్ లో ఉంటారని వ్యాఖ్యానించారు.

 

 

రెబెల్స్ ఎమ్మెల్యేలు సింధియా అనుచరులైనా, వారందరూ తనతో రహస్యంగా మాట్లాడుతున్నారని ప్రకటించారు కమల్ నాథ్. తాము కచ్చితంగా మెజారిటీని నిరూపించుకొని తీరుతామన్నారు. తనకోసం మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ అగ్రనేతలు చాలా ప్రయత్నించారని...అయితే తాను ఎవరి వలలో పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కమల్ నాథ్. బెంగళూరులో ఉన్న రెబల్స్ ఎమ్మెల్యేలు...తమ వారేనని.. తమ ఎమ్మెల్యేలపై నమ్మకముందన్నారు. వారితో టచ్‌లోనే ఉన్నానని ప్రకటించారు. 

 

 

మరోవైపు ఎంపీ గవర్నర్‌ కు ఆయన రాసిన లేఖపై కూడా స్పందించారు కమల్ నాథ్. తమకు మెజారిటీ ఉందని, ఎవరైనా తమకు మెజారిటీ లేదని వాదిస్తే, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని సవాల్ విసిరారు. రెబెల్స్ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు ఫ్లైట్ సౌకర్యాలు సమకూర్చారని, అలాగే పోలీసుల పహారాలో వారిని బెంగళూరుకు పంపించారని మండిపడ్డారు. బెంగళూరులో రిరార్టులో వారిని ఖైదీల్లా ఉంచారని... వారికి అక్కడ స్వేచ్ఛ లేదన్నారు. వారి ఫోన్లను కూడా అక్కడి నేతలు తీసేసుకుంటున్నారని ఆరోపించారు. 

 

 

రెబెల్స్ కనక బీజేపీలో చేరితో ఇప్పటికే జ్యోతిరాదిత్యతో ఉండేవారని, కానీ వారు కాంగ్రెస్‌ను ఎందుకు వీడలేదని ప్రశ్నించారు కమల్ నాథ్. వారందరూ త్వరలోనే భోపాల్‌కు తిరిగి వస్తారని, వారికి ఎలాంటి ప్రాణహాని లేదని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, మరోసారి ముఖ్యమంత్రి కావాలని శివరాజ్ సింగ్ కలలు కంటున్నారని కమల్‌నాథ్ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: