తెలంగాణాలో కరోనా కట్టడికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. ప్రజలను అప్రమత్తం చేయడం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎవరిని ఇళ్ళ నుంచి బయటకు రానీయకుండా, వ్యాపార సముదాయాలు, ఉద్యోగాలు, కంపెనీలు అన్నీ ఆపేశారు. ఆర్టీసి బస్సు సర్వీసులు కూడా బంద్ అయిపోయాయి. జనతా కర్ఫ్యూ విషయంలో తెలంగాణా చాలా జాగ్రత్తలు పడుతుంది. ప్రజలు అందరిని అప్రమత్తం చేసారు ముఖ్యమంత్రి. దేశం మొత్తం 14 గంటలు అంటే తెలంగాణాలో మాత్రం 24 గంటలు అని ప్రకటించారు. 

 

ముఖ్యమంత్రి చెప్పిన మాటను గౌరవించి ప్రజలు ఎక్కడా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. అన్ని సేవలను ఆపివేశారు. అత్యవసర సేవలు మినహా తెలంగాణాలో ఏ ఒక్కటి కూడా నడవడం లేదు. బస్సులను కూడా ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆర్టీసి డిపోలకే పరిమితం అయ్యాయి బస్సులు అన్నీ కూడా. చాలా ప్రాతాలలో ప్రజలు బయటకు రావాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మోడీ ఇచ్చిన పిలుపు కెసిఆర్ ఇచ్చిన ఆదేశాలతో అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ అయిపోయాయి. 

 

తెలంగాణా ప్రభుత్వం కూడా కరోనా కట్టడి కోసం అన్ని విధాలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసారు అధికారులు. వైద్యుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసివేసారు. నిజామాబాద్ లో మహారాష్ట్ర సరిహద్దులను మూసి వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అదిలాబాద్ జిల్లాలో కూడా మూసి వేసారు. మెదక్ తో పాటుగా పలు జిల్లాలు మహారాష్ట్ర సరిహద్దుని పంచుకుని ఉన్నాయి. అవి అన్నీ కూడా ఇప్పుడు బంద్ చేసారు. అధికారులు కూడా కెసిఆర్ ఆదేశాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా అలసత్వం ప్రదర్శించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: