ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్ని కరోనా వైరస్  ప్రభావం వల్ల బెంబేలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తోంది. అయితే ఈ వైరస్ కు  సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ప్రాణాలు పోతాయో అనే  భయం దేశ ప్రజలందరి లో ఉంది. అయితే కరోనా  వైరస్ సోకితే ప్రాణాలు పోవడమే కాదు... కరోనా వైరస్ ప్రభావం కారణంగా చాలామంది వ్యాపారులకు ప్రాణాలు పోయినంత పని అవుతుంది. ఎందుకంటే కరోనా  వైరస్ కారణంగా ఎంతోమంది వ్యాపారులు  కోట్లల్లో నష్టపోతూ నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు. అయితే దేశంలో రోజురోజుకీ కరోనా  వైరస్ విజృంబిస్తున్న  నేపథ్యంలో...  ఎక్కువగా మొదలైన ప్రచారం చికెన్ తింటే కరోనా  వైరస్ సోకుతుందని. పౌల్టీ  పరిశ్రమల కోళ్ళకి కరోనా  వైరస్ సోకిన నేపథ్యంలో చికెన్ తినే వారందరికీ కరోనా  వైరస్ సోకుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం తెగ వైరల్ అయిపోయింది. 

 

 

 ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలను ఈ వార్త అయోమయంలో పడేసింది. నిజంగానే చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందేమో  అని చికెన్ తినడం కాదు కదా... అటు వైపు చూడడమే  మానేశారు ప్రజలు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారులు  తీవ్రస్థాయిలో నష్టపోయారు. రోజురోజుకు చికెన్ రేటు భారీగా పడిపోయింది. ఏకంగా   ఉచితంగా కోళ్లు  పంచి  పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది . ముఖ్యంగా ఈ ప్రచారం తెలంగాణ రాష్ట్రంలో  వేల కోట్ల నష్టానికి కారణమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ చికెన్ తినడం వల్ల కరోనా  వైరస్ సోకదు అంటూ   క్లారిటీ ఇచ్చారు. 

 

 

 ఈ ప్రచారం నేపథ్యంలో మొన్నటి వరకు 100 లోపు ఉన్న కేజీ చికెన్ ధర ప్రస్తుతం రెండు వందలకు పైగా పెరిగింది. అయితే దీనిపై పరమేశ్వరి పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు  సినీనటుడు నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి కోటి దండాలు అంటూ కేసిఆర్ కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలుపుతూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అంతేకాకుండా మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యిలా ఉంది.. కోట్లు పెట్టుబడి పెట్టాం కానీ భయంగా ఉంది. దియబ్బ కరోనా  అంటూ పౌల్ట్రీ పరిశ్రమలో  కోడిని ముద్దు పెడుతున్న  ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు బండ్ల గణేష్. ఇక ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: