ఏదైనా సమస్య ఎదురైతే తమ ప్రజలను కాపాడడానికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా... ముందుకొచ్చి రొమ్ము చూపే రాజులు ఇప్పుడు ఉన్నారా? అని ప్రశ్నిస్తే సమాధానం నెగిటివ్ గానే వినిపిస్తోంది. అప్పట్లో రాజులు తమ ప్రజలను కాపాడాలని అనుకునేవారు కానీ ఇప్పట్లో రాజులు మాత్రం తమ రాజ్య ప్రజలు ఎక్కడైనా చావని.. తాము బతికితే చాలు అని అనుకుంటున్నారు. తాజాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న వేళ... థాయిలాండ్ దేశ రాజు తమ రాజ్య ప్రజల కోసం పట్టించుకోవాల్సింది పోయి... కరోనా దెబ్బకి జర్మనీ దేశానికి పారిపోయాడు. ప్రస్తుతం ఆ రాజు ని తిట్టిన వారే తప్ప పొగిడిన వారు ఎవరూ లేరు. రాచరికాన్ని విమర్శిస్తే అక్కడ 15 ఏళ్లపాటు శిక్ష పడుతుంది... కానీ ఆ దేశ ప్రజలు మాత్రం ఏ బిడియం లేకుండా ఆ రాజు ని నానా బూతులు తిడుతున్నారు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... థాయిలాండ్ దేశానికి రాజైనా మహా వాజిరాలోంగ్కోర్న్ కి 67 ఏళ్లు. 2016లో తన తండ్రి మరణించగా మూడేళ్ల తర్వాత ఈయన సింహాసనాన్ని అధిష్టించాడు. థాయ్ మసాజ్, సెక్స్ పార్లోర్స్, ఇంకా ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఆ దేశంలో సర్వసాధారణమన్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రజలే కాదు అక్కడి రాజు కూడా మామూలోడు కాదు. ముగ్గురు అందమైన పెళ్ళాలను చేసుకొని... వారిపై బోర్ కొట్టగా వారిని వదిలేసి... తనకు బాగా నమ్మకం ఉన్న ఒక సాధారణ మహిళను వివాహమాడాడు. కానీ ఆ యువతి బంధువులు పెత్తనం చలాయిస్తుంటే ఆమెకు విడాకులు ఇచ్చి రాణి పేరును గట్రా లాక్కొని వారిని తన్ని తరిమేశాడు.



ఇవన్నీ పక్కన పెట్టి ప్రస్తుత సంగతి గురించి మాట్లాడుకుంటే... కరోనా భయంతో ఈ రాజు జర్మనీలోని గ్రాండ్ హోటల్ కి అకస్మాత్తుగా మకాం మార్చాడు. ఇటీవల కాలంలో లండన్, యూరప్ దేశాల రాజులకు కరోనా వైరస్ సోకిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయన్న విషయం తెలిసిందే. దాంతో కరోనా వైరస్ ఏ మానవుడైనా వస్తుందని హడలిపోయిన థాయిలాండ్ రాజు 119 పరిచారకులు, 20 అందమైన ఉంపుడుగత్తెలని తన వెంట బెట్టుకుని జర్మనీలోని గర్మిస్చ్-పార్టెన్కిర్చెన్‌‌కు వెళ్లి అక్కడ అల్పైన్ రిసార్ట్ టౌన్‌లోని సొన్నెన్‌బిచ్ల్ గ్రాండ్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. ఆ హోటల్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాడు.



ఐతే సాధారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండేవారు ఇతరులకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఈ రాజ మాత్రం తనతో పాటు తెచ్చుకున్న 20 అందమైన ఉంపుడుగత్తెలని తన గదిలోనే ఉంచుకుంటూ హాయిగా సరసాలాడుతున్నాడు. మిగతా వారందరికీ సపరేట్ గా ఒక్కొక్క రూమ్ లో ఉండేలా ఆదేశించాడు ఆ రాజు. హోటల్ మొత్తం బుక్ చేసుకున్నాడు కాబట్టి... ఇక ఆ దేశ ప్రజలు తప్ప మరే ఇతర వాళ్ళకి ఆ హోటల్లో కి అనుమతి లేదు. అయితే ప్రస్తుతం తమ దేశ ప్రజలందరిని వదిలేసిన ఈ రాజు పై సవాలక్ష విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థాయిలాండ్ దేశంలో ప్రస్తుతం పదిహేను వందల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా... ఆరేడు మంది మృత్యువాత పడ్డారు. కానీ ఈ రాజు మాత్రం ఇటువంటి అత్యవసరమైన పరిస్థితులలో అవసరమైన చర్యలను చేపట్టకుండా... దేశం వదిలి జర్మనీ దేశానికి మకాం మార్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటువంటి స్వార్థమైన రాజుని మేమెప్పుడూ చూడలేదు అంటూ ప్రపంచ దేశాలు కూడా నోరెళ్ళబెడుతున్నాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: