దేశంలో కరోనా చేస్తున్న కరాళ నృత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి మనుగుడకే ప్రశ్నార్థకంగా మారిన ఈ కరోనా రోజు రోజుకీ పెరిగిపోతుంది.  అయితే మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించి కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో పాట్లు పడుతున్నారు.  కానీ కొంత మంది కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు.  కొంత మంది అయితే ఐసోలేషన్‌ వార్డు నుంచి పారిపోతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. అలాంటి వారితో ఇంకెంత మందికి కరోనా వ్యాప్తి చెందుతుంతో అని వైద్యులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా  ఓ 55 ఏళ్ల కరోనా అనుమానిత రోగి ఐసోలేషన్‌ వార్డు నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రాణాలను బలిగొంది.

 

ఆరో అంతస్తు నుంచి తన బెడ్ షీల్ తో కిటికీకి కట్టి కిందకు దీగే ప్రయత్నం చేశాడు.. కానీ అనుకోకుండా పట్టు తప్పి కిందపడిపోయి చనిపోయాడు.  ఈ ఘటన హర్యానాలో సోమవారం ఉదయం 4 గంటల సమయంలో చోటు చేసుకుంది. పానిపట్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌ 1న కర్నాల్‌లోని కల్పన చావ్లా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేరాడు. ఇతనికి కరోనా అనుమాని లక్షణాలు లేనప్పటికీ.. అతనికున్న ఆరోగ్య సమస్యల రీత్యా ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 

తనకు కరోనా లేదని చెప్పినా వినకుండా ట్రీట్ మెంట్ చేయడంపై రోగి అసహనానికి గురై అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనకున్నాడు.  ఇవాళ తెల్లవారుజామున బెడ్‌షీట్లు, కవర్ల సహాయంతో ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు ఆ వ్యక్తి. ఇతని రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినప్పటికీ ఫలితం ఇంకా రాలేదు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: