సాధారణంగా మనకు ఇష్టం లేని వాళ్లను మనతో విభేదించిన వాళ్లను మన మీద రాళ్లు వేసిన వాళ్లను మనకు అనుకూలంగా లేని మనుషులను ఒక్క ముక్కలో చెప్పాలంటే అస్మదీయులు అంటే ఐనవాళ్లందరినీ.. ఒక్క వవీకరణ మంత్రంతో లోబర్చుకోవొచ్చు. లేదంలే తెలుగు చిత్రాల్లో సూపర్ హిట్ చిత్రం మాయాబజర్ లో క్లయిమాక్స్ లో తస్మదీయులు అంటే వ్యతిరేకులను తాళ్లతో చాపలో కట్టేసి970 కీ. మీ పొడుగు ఉన్న సముద్రంలో ఎక్కడైనా పడవేయొచ్చు. అయితే ఇదంతా మనం చేయాల్సిన పనిలేదు.. అంతా ఆ వశీకరణ మంత్రమే చేసేస్తుంది.  స్నేక్స్ అండ్ లాడెర్స్ అనే వైకుంఠపాళీ.. ఆట గురించి పదహారు నెలల పాటు నాలుగు గోడల మద్య అహో రాత్రులు శ్రమించి నేర్చుకున్నారు సీఎం జగన్. మొత్తానికి ఎలాగో అలా విజయం సాధించాడు.

 

 అయితే పులికి చెట్టు ఎక్కడం పిల్లి నేర్పించనట్టుఆయన ఒక్క సూతం మాత్రం నేర్చుకోలేదు.  అదే అఖండ వశీకరణ మంత్రం.. యంత్రం.  అసలు వశీకరణం అంటే ఏంటీ.. తనను కాదన్న వాళ్లను.. తనకు దూరం జరిగిన వారిని ఆ మంత్ర మహితో తన వైపు తిప్పుకొని తాను ఏది చెప్పాలనుకుంటే దానికి అడ్డు చెప్పకుండా అందరూ మూకుమ్మడిగా తాను ఏం చేలాలనుకున్నారో అది చేసేదే వశీకరణ మంత్రం. ఒక చిన్న నిమ్మకా.. ఓ పెద్ద గ్లాసు నీళ్లు తో చేసే ఇంత పెద్ద మంత్ర ప్రక్రియను ఆయన తెలుసుకోకపోవడం ఏంటీ? అందుకే ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా అసమ్మతి. అయితే ఇంత పెద్ద పదవిలోకి వచ్చిన ఈయన ఇంత చక్కటి వశీకరణ మంత్రాన్ని విస్మరించడం నమ్మలేని నిజం. అయ్యా.. ఎస్ అనాల్సిన వారు అందరూ.. వరుస బెట్టి మీకు వ్యతిరేకంగా వాదిస్తుంటే.. మీకు చెప్పకుండానే మీ స్టేట్ ఎలక్షన్ అధికారి ఆ మహమ్మారి వైరస్ పేరు చెప్పి మొత్తం పంచాయితీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్ని వాయిదా వేశారు.  

 

మీరు మాత్రం ససేమిరా కుదరని అన్నారు.. కానీ పైవాళ్లు ఆయన వాదన ఒకే అన్నారు. ఇప్పుడు ఆయనను పదవీ లో నుంచి బర్తరఫ్ చేసి చెక్ పెట్టారు.  వైరస్ ఓడిపోతుందేమో కానీ.. కానీ ఆ వైరస్ కారణం చెప్పిన ఆ అధికారి మాత్రం ఎందుకో గెలుస్తాడనిపిస్తుంది? కొంపదీశి  ఈ లాక్ డౌన్ అతన్ని గెలిపిస్తాయా ఏంటీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే జనం గొల మనకెందుకు అన్నకున్నా.. జనం మనసు గెల్చుకున్నా.. కానీ ఇక్కడ సమస్య మన కోసం పనిచేసే ప్రభుత్వ సిబ్బందిది. ప్రతి కూల పరిస్థితుల్లో ఆ జనం కోసం పని చేసే అధికారులు.. ప్రభుత్వ సిబ్బంది.. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ద్య కార్మికులు. వీరంతా బాధ్యతగా పని చేస్తుంటే.. మీరేమో ఒక్కొక్కరిపై వేట్లు వేసుకుంటూ పోతున్నారని జనాలు అంటున్నారు. ఇది కలం పోటు అని.. లేదు కులం పోటు అని.. రక రకాల చర్చలు మొదలయ్యాయి.  ప్రతిపక్షలాపై ఇప్పుడు పగా ప్రతికారం కన్నా జనం మనసు ఎరిగి సమస్యలను సానుకూలంగా ఆలోచిస్తూ.. వశీకరణ మంత్రం పాటిస్తే చాలా మంచిది.  ఒకప్పుడు పెద్దాయన నేర్చుకొని ఎంతో నేర్పుగా రాజ్యాన్ని ఏలారు.. మీరు ఆ బాట పడితేనే మంచిదని సన్నిహితులు.. ఐన వారు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: