ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. అయితే కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్ర కృషి చేస్తున్నారు. అయినా సరే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదే విషయంపై టీడీపీ నేతలు కూడా ఫోకస్ చేసి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వలనే కరోనా కేసులు పెరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

ఇదే సమయంలో మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై కూడా రాజకీయం జరుగుతుంది. ఆయన సెక్యూరిటీ కావాలని కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసిన విషయంపై సీఐడీ విచారణ చేస్తుంది. ఆ విచారణలో భాగంగా రమేష్ కుమార్ ల్యాప్ టాప్ లో టైప్ చేసిన లేఖని పెన్ డ్రైవ్ లోకి తీసుకుని దాన్ని వాట్సాప్ వెబ్ ద్వారా హోమ్ శాఖకు పంపారని, కానీ ఆ తర్వాత పెన్ డ్రైవ్ ధ్వంసం చేసారని, డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేసారని విచారణలో తేలింది.

 

అయితే ఇదే వైసీపీ మైండ్ గేమ్ అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసి, ఏపీ ప్రజలకు ఎంతో మేలు చేసారని, కానీ ఆయనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి ఇలా చేస్తుందని అంటున్నారు. అసలు కరోనా సమస్యని డైవర్ట్ చేయడానికి ఇది విజయసాయి రెడ్డి ఆడుతున్న నాటకమని చెబుతున్నారు. ఆయన కావాలనే డీజీపీకి ఫిర్యాదు ఇచ్చి, సీఐడీ ద్వారా విచారణ చేయిస్తున్నారని అంటున్నారు.

 

ఇప్పటికే రాష్ట్రంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుందని, అది అరికట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై, నిమ్మగడ్డ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. కేవలం కరోనా పై ప్రజలు ఫోకస్ పెట్టకుండా ఉండేందుకు వైసీపీ ఆడిస్తున్న ఓ మైండ్ గేమ్ అని, ప్రజలు దీని గ్రహించాలని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: