ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది . ఏకంగా  ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతో మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా  గణాంకాలు చూస్తే భయాందోళనకు గురి కాకుండా ఉండరు. ముఖ్యంగా అగ్రరాజ్యాలతో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. రోజురోజుకు ఈ మహామారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆయా దేశాల  ప్రభుత్వాలు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది . ఇక ఈ మహమ్మారి వైరస్ ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజా పరిశోధనలో వెల్లడైన అంశాలను చూస్తే వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. పురుషుల కంటే మహిళలపై  వైరస్ ప్రభావం తక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

 

 

 అమెరికాలోని పరిశోధకులు మహిళలు సెక్స్ హార్మోన్ల ద్వారా పురుషుల పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత వారం న్యూయార్క్ లోని కొందరు కరోనా  పేషెంట్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం ఈస్ట్రోజెన్ హార్మోన్  ఇచ్చారు. మహిళల్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ లాస్ ఏంజిల్స్లోని  వచ్చేవారం పురుషుల పేషెంట్లకు చికిత్స ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ తమ హాస్పిటల్లో ఉన్న 75% మంది రోగులు   పురుషులే ఉన్నారని అక్క పరిశోధకులు చెబుతున్నారు. అయితే గర్భం దాల్చిన స్త్రీలలో మరింత రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ... ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉంటుందని దీంతో వారిలో కరోనా  లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి అంటూ అక్కడి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

 

 

 ఈ రెండు రకాల హార్మోన్ల ద్వారా కరోనా వైరస్ బారిన ఎక్కువగా పడుకుండా  మహిళలు రక్షించుకోగలుపుతున్నారు అంటూ తెలిపారు. అయితే సదరు హార్మోన్లు ద్వారా చికిత్స అందిస్తే ఫలితం ఉంటుందా లేదా అనే దానిపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు నిపుణులు. మరికొంతమంది మహిళల్లో  ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించడం అసాధ్యమని భావిస్తున్నారు. అంతేకాకుండా పురుషుల్లో పొగతాగే అలవాటు ఎక్కువగా ఉండడం... చేతులు కడుక్కునే అలవాటు తక్కువ ఉండటం కారణంగా ఎక్కువగా పురుషులు ఈ మహమ్మారి భారిన  పడుతున్నారని మరి కొందరు నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: