ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మే 7  వరుకు  లాక్ డౌన్ విధానాన్ని పొడిగించడం జరిగింది. ఇక మరో వైపు  ఈ మహమ్మారిని అరికట్టేందుకు పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమ చేస్తూ ఉన్నారు.  ఈ మహమ్మారిపై పారిశుద్ధ కార్మికులు వీధిలో శ్రమిస్తూ ఉంటే మరోవైపు ఆస్పత్రులలో డాక్టర్లు, నర్సులు  వైరస్ ను అరికట్టేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. 


ఇక ఈ మహమ్మారిని అరికట్టే చర్యల్లో శ్రమిస్తున్న ghmc తో పాటు అన్ని మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఇక వీడియో సారాంశం ఏమిటి అన్న విషయానికి వస్తే.. కరోనా వైరస్‌ మహమ్మారిని  అరికట్టేందుకు  జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ముందుకి వచ్చి ప్రజల అందరకీ రక్షణగా నిలపడుతున్నారు అని తెలియచేస్తుంది వీడియో...


ఇక నగరాన్ని శుద్ధ పరుస్తూ ప్రజలందరికీ రక్షణగా నిలుస్తున్నారు. ఈ భాగంలో దాదాపు 21 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పాలి. అంతేకాకుండా ఐదువేల స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, సహాయకులు కలిసి ప్రతి ఇంటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారు అనే చెప్పాలి. అలాగే ప్రతి రోజు ఆరు వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకోసం 1,000 పవర్‌ స్ప్రేయర్లు, 817 క్నాప్‌సాక్‌ స్ప్రేయర్లు, 63 వెహికిల్‌ మౌంటెడ్‌ ఫాగింగ్‌ మెషిన్లు, 305 పోర్టబుల్‌ ఫాగింగ్‌ మెషిన్లు వాడుతున్నారు అని మంత్రి తెలియచేసారు. అలాగే మున్సిపాలిటీ తోపాటు టిఆర్ఎస్ కు చెందిన 675 కార్మికులు కూడా నగరాన్ని శుభ్రపరిచేందుకు శ్రమిస్తున్నారు అని ఆయన తెలియ చేసారు. దీని కోసం ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీడియో సందేశాన్ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: