ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో 200కు పైగా దేశాలు తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలు అన్ని చైనా పై విమర్శలు చేస్తున్నా చైనా మాత్రం ఈ వైరస్‌ను పూర్తిగా కంట్రోల్ చేసి త‌న వ‌ర‌కు సేఫ్‌ అయింది. అయితే ప్రపంచ దేశాల్లో మాత్రం ఈ వైరస్ ప్రభావంతో కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని లాక్ డౌన్ పాటించడంతో అన్ని దేశాల‌ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా కుప్పకూలాయి. ఈ ప్రభావం మన దేశంపై సైతం ఉంది. అయితే ఇప్పుడు ఈ కరోనా మన దేశ ఆలోచన గమనాన్ని మార్చి వేస్తుందా ? అంటే అవున‌నే అంటున్నారు ఆర్థిక నిపుణులు.

 

 ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలు చైనా కేంద్రంగా పని చేస్తుంటాయి. అక్క‌డ శ్రామికుల‌కు త‌క్కువ వేత‌నాలు.. వ‌ర్క ఆర్డ‌ర్ క‌మిట్ మెంట్లు చాలా మందికి న‌చ్చుతాయి. ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు అన్ని చైనా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీరి దృష్టిని భార‌త్ వైపు మ‌ర‌ల్చేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పావులు క‌దుపుతున్నారు. చైనా నుంచి మ‌న‌దేశానికి వ‌చ్చి ఇక్క‌డ పారిశ్రామిక సంస్థ‌లు, యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థ‌ల‌కు భారీ రాయితీలు, స్థ‌లం కేటాయించే ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా 461589 హెక్టార్ల భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది. 

 

ఇందులో 115131 హెక్టార్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్.. గుజరాత్.. మహారాష్ట్ర.. తమిళనాడుల్లో ఉందంటున్నారు. ఇప్ప‌టికే డ్రాగ‌న్‌కు వ్య‌తిరేకంగా మ‌న దేశం అమెరికాకు అత్యంత స‌న్నిహితంగా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చైనా నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోన్న ప‌లు పారిశ్రామిక కంపెనీల‌కు మ‌నం దిక్సూచి కాబోతున్నాం. ఈ విష‌యంలో మోదీ వేస్తోన్న ఎత్తులు డ్రాగ‌న్‌కు పెద్ద షాక్ అన‌డంలో సందేహం లేదు. దీనిపై డ్రాగ‌న్ ఎలా స్పందిస్తుందో ?  చూడాలి.*

మరింత సమాచారం తెలుసుకోండి: