టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు టిడిపి నేతలు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టిడిపి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల జల హక్కు గురించి ప్రస్తావిస్తూ నేతలందరి లో కొత్త ఊపిరి నింపారు. మొన్నటివరకు పోతిరెడ్డిపాడు నీటి హక్కుల విషయంలో స్పందించకుండా మౌనంగానే ఉన్న చంద్రబాబు నాయుడు... ప్రస్తుతం కాలేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించతలపెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుకు.. ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ డిజైన్  చేసి నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు ఎన్నో తేడాలు  ఉన్నాయి అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు. రీ డిజైన్  ద్వారా కావల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో నీటి వినియోగం కాళేశ్వరం వద్ద ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇక ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి గతంలో టిడిపి పార్టీ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది టిడిపి పార్టీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. 

 


 మొన్నటి వరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడు కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం ఒక మంచి పాయింట్ తెరమీదికి తెచ్చారు అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి జల హక్కులు ఎంతమేరకు ఉంది కాలేశ్వరం ప్రాజెక్టు ఎంతమేరకు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.. అనే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది ఆ తరువాత కోర్టులో న్యాయపోరాటం చేసింది  టిడిపి పార్టీ గుర్తు చేసి కార్యకర్తల్లో కొత్త ఊపిరి నింపారు  నారా చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ జల హక్కు కోసం ఎంతగానో పోరాడింది అని చెప్పి పార్టీ క్యాడర్ లో ఎంతగానో దైర్యం నింపారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: