మాజీ సీఎం చంద్రబాబుకు ఈసారి హైకోర్టులో ఎదురు దెబ్బ తప్పేలా లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయ స్థానాన్ని కోరారు.

 

 

ఇంతకూ అసలేం జరిగిందేటే.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల ఆగారు. ఇందు కోసం టీడీపీ నేతలు భారీగా జనసమీకరణ చేశారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ఇవన్నీ లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కిందే వస్తాయి. ఈ విషయాన్నే పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయ స్థానం మందు వుంచారు.

 

 

అంతే కాదు.. వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి కూడా చంద్రబాబు ఉల్లంఘనలను సుమోటో తీసుకోవాలని కోరుతూ హైకోర్టుకు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే.. దాదాపు ఇవే ఆరోపణలపై పలువురు వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ కేసుల్లో విచారణ కొనసాగుతోంది.

 

 

ఇప్పుడు ఇది కూడా దాదాపు అదే తరహా కేసు కాబట్టి ఈ కేసులో చంద్రబాబు కు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల ఏపీ హైకోర్టు చాలా కేసులు సుమోటోగా స్వీకరిస్తోంది. డాక్టర్ సుధాకర్ కేసును టీడీపీ నేత వంగల అనిత లేఖ రాయడం వల్లే హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇదొక్కటే కాదు.. మిగిలిన చాలా కేసులు సుమోటోగా తీసుకుంది హైకోర్టు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే వ్యూహం ఫాలో అవుతున్నారు. మరి హైకోర్టు వీరి లేఖలను కూడా పరిగణనలోకి తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేస్తుందా లేదా అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: