ఒక మనిషి తన జీవితంలో సంఘర్షణ లేకపోతే బ్రతకలేడు. అది తనతో తాను చేసుకునే ఆత్మ సంఘర్షణ అయినా కావచ్చు లేదా ఎదుటివారితో అనవసరంగా పెట్టుకునే వివాదం రూపంలో అయినా కావచ్చు. విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి చాలా ముందుగానే తెలుసుకున్నాడు. గతంలో నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే శాసనం. వారి మాటకు ఎదురు ఉండదు. చిన్న పని కావాలన్నా వారి రికమండేషన్ ఉంటే క్షణాల్లో జరిగిపోతుంది. అన్ని వారి కనుసన్నల్లోనే అన్నీ జరుగుతుండేవి. అలా ఎన్నోసార్లు కొందరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు వివిధ రకాల అక్రమ వ్యాపారులతో, కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అక్రమార్జన చేసిన సందర్భాలు మెండుగా ఉన్నాయి.

 

అయితే మొదటి నుంచి అవినీతిరహిత పాలన కోరుకుంటున్న జగన్ దీనికి సరైన చెక్ పెట్టేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ వాలంటీర్ల వ్యవస్థ. అసలు ఎక్కడో ఒక నియోజకవర్గం లోని మారుమూల పల్లెటూరు లో జరుగుతున్న అక్రమం గురించి ఎవరూ నోరు మెదపరు. ఒకవేళ ఎవరైనా నోరు ఎత్తినా.... రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు అండతో గొంతు ని అక్కడే ఆపేస్తారు. అయితే గ్రామ పాలన వ్యవస్థలో వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది కీలకంగా మారడంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో లేకుండానే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయి.

 

పరిణామాలు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల కే రుచించడం లేదు. తమకు విలువ లేకుండా పోయిందని గ్రామస్థాయి నాయకులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకూ కొన్ని చోట్ల బాధపడుతున్నారట. ఇక పార్టీ పేరు చెప్పి ఎమ్మెల్యేల అనుచరులు అక్రమ దందాలు చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. సంక్షేమ పథకాలు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ ఇవ్వడం మరియు టిడిపి సానుభూతిపరులు లకు సంక్షేమ పథకాలు, నగదు బదిలో వాలంటీర్ల దయ వల్ల టైమ్ కి అందడంతో వైకాపా మద్దతుదారులు కొద్దిగా అసహనం మొదలయిందట.

 

వాలంటీర్లు నిఘా నేత్రంగా పనిచేస్తుండటంతో అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు భయపడుతున్నారట. అధికారంలోకి వచ్చినా ఎలాంటి లబ్ది పొందలేకపోతున్నామని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు వాపోతున్నారుట. నేపథ్యంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూనే పనిలో పనిగా తమ అనుచరులపై ఏమైనా అరా తీస్తున్నారా అంటూ మెల్లగా వాలంటీర్లను అడుగుతున్నారట. ఇప్పుడు అర్థమైందా జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఎందుకు రూపొందించాడో...?

మరింత సమాచారం తెలుసుకోండి: