ఐఎంఏ పోంజి స్కామ్ లో అరెస్టైన ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ శంకర్ ఆత్మహత్య.. కర్ణాటకలో కలకలం రేపుతోంది. అవమానాన్ని తట్టుకోలేక విజయ్.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి, తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో వాటిని ఫేస్ చేయకుండా.. ఆత్మహత్యకు పాల్పడడం అధికారులను షాక్ కు గురి చేసింది.

 

ఐఎమ్ఏ పోంజి స్కామ్.... కర్ణాటకను అట్టుడికిస్తోంది.ఇస్లామిక్ పద్దతుల ద్వారా ఐఎమ్ఏ,సిస్టర్ కంపెనీ పోంజీ... కొందరు పెట్టుబడి దారుల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు సమీకరించారు.పెట్టుబడులకు అత్యధిక రిటర్న్ లు ఆశజూపి .. నిధులు సేకరించారు. ఈకేసులో ఆరుగురు కర్ణాటక అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని సీబీఐ.. స్టేట్ గవర్నమెంట్ అనుమతి కోరుతూ లేఖ రాసింది.  పూర్తి వివరాలతో సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్దం చేసింది. ఐఎమ్ఏ  మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ మన్సూర్ ఖాన్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.

 

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని, అరెస్టైన ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ .. జయనగర్ లోని తన నివాసం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. ఐఎమ్ఏ నుంచి కోటిన్నర రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజా విచారణకు సంబంధించి, విజయ్ శంకర్ పేరు ప్రస్తావించడం జరిగింది.ఈ దారుణం జరిగిన సమయంలో భార్య, కుమార్తె ఇంటిలోనే ఉన్ారు. సాయంత్రం ఇంటిలో వారితో గడిపిన విజయ్ శంకర్.. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మీటింగ్ రూముకెళ్లి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

 

గతంలో విజయ్ శంకర్..బెంగళూరు సిటీ కలెక్టర్ గా పనిచేశారు. ఘటనాస్థలికి చేరుకున్న తిలక్ నగర్ పోలీసులు ..దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఎమ్ఏ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం .. అధికార వర్గాలను షాక్ కు గురిచేసింది. అయితే అవమాన భారంతోనే విజయ్ శంకర్.. సూసైడ్ చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: