ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టీడీపీలో ఎవరు ఉంటారు ? ఎవరు వెళ్తారు అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఒకపక్క అధికారం లేకపోవడం మరో పక్క కీలక నేతలు పార్టీ మారడం అన్నీ కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు తల నొప్పిగా మారాయి. అగ్ర నేతలను కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే వారు మాత్రం ఆగడం లేదు. పార్టీలో మ‌హామ‌హులు అయిన నాయ‌కులు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చంద్ర‌బాబును న‌మ్మ‌డం లేదు. రోజు రోజుకి పార్టీలో అసమ్మతి కూడా పెరుగుతుంది. వైసీపీ అధిష్టానం దూకుడు కూడా టీడీపీ ని ప్రశాంతంగా ఉండనీయడం లేదు అనే చెప్పాలి.  అసలు ఎవరు ఉంటారు  ఎవరు పార్టీ మారే అవకాశం ఉంది అనేది విపక్షాని అర్ధం కావడం లేదు. 

 

టీడీపీలో అంత‌ర్గ‌తంగా విన‌ప‌డుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు ఆరుగురు మాజీ మంత్రులు లైన్ క్లియర్ చేసుకున్నారు వైసీపీలోకి వెళ్ళడానికి అనే ప్రచారం జరుగుతుంది. వారికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు పరిస్థితులు సహకరిస్తున్నాయి అని పరిశీలకులు అంటున్నారు. వైసీపీలోకి వెళితే ఇప్ప‌టికిప్పుడు ప‌ద‌వులు ప‌రంగా ఒరిగేదేం లేక‌పోయినా.. త‌మ వ్యాపారాల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్న హామీలు వ‌చ్చేశాయ‌ట‌. ఇక రాజ‌కీయంగా కూడా ఇబ్బందులు ఉండ‌వ‌న్నది కూడా వారికి రూట్ క్లియ‌ర్ అయ్యేందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. 

 

పార్టీ మారడానికి గానూ జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఓ సన్నిహిత కీలక నేతను ముగ్గురు మాజీ మంత్రులు గుంటూరు జిల్లాలో కలిసారు అని... ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు అని అంటున్నారు. దీనితో ఏ క్షణం అయినా సరే పార్టీ మారడం ఖాయమని అంచనా వేస్తున్నారు. జులై 8న వారు మారే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: