ముంబైలోని నానావతి ఆసుపత్రిలో దాదాపు ఇరవై మూడు రోజులపాటు కరోనా కి చికిత్స పొంది ఈ రోజు అనగా ఆదివారం నాడు covid-19 వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని తన తండ్రి అమితాబ్ బచ్చన్ డిశ్చార్జీ అయ్యారని అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే అభిషేక్ బచ్చన్ ఈ రోజున కరోనా టెస్ట్ చేయించుకున్నారు కానీ అతనిలో ఇప్పటికీ కరోనా వైరస్ అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. దీంతో అభిషేక్ బచ్చన్ నానావతి ఆసుపత్రిలోనే ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఆదివారం సాయంత్రం బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నాను. సర్వశక్తిమంతుడి దయ, మా బాబుజీ యొక్క ఆశీర్వాదం, ప్రార్థనలు & దగ్గరి & ప్రియమైన స్నేహితుల అభిమానులు ప్రార్థనల కారణంగా ... నానావతి వద్ద అద్భుతమైన సంరక్షణ, నర్సింగ్ కారణంగా నేను పూర్తిగా వ్యాధి నుండి కోలుకోవడం నాకు సాధ్యమైంది. హాయిగా ఇంటికి వెళ్లిపోయి గృహ నిర్బంధంలో ఉండి పోతాను', అని అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.



అమితాబచ్చన్ కంటే ముందస్తుగానే అభిషేక్ బచ్చన్.. తన తండ్రి ఈ రోజు కొవిడ్ 19 టెస్ట్ చేయించుకున్నారని.. అదృష్టవశాత్తు అతనికి నెగిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. అతను కోరుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ  హృదయపూర్వక ధన్యవాదాలని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. 'దురదృష్టవశాత్తు ఈరోజు నేను చేయించుకున్న కరోనా టెస్టులో పాజిటివ్ అని తేలింది. అందుకే ఆసుపత్రిలోనే ఇంకా చికిత్స పొందుతున్నాను. కరోనా పై నేను గెలిచి తీరుతాను. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతాను' అనే ట్విట్టర్ వేదికగా అభిషేక్ బచ్చన్ ప్రమాణం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: