కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దుల్లో వ్యవహరిస్తున్న తీరుపై ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా చేసేదేమీ లేక బేరసారాలకు దిగుతోంది. మొన్నటివరకు దబాయింపుతో ఉన్న చైనా  ఇప్పుడు మాత్రం విన్నపాలకు  దిగుతుంది . ఇంతకీ సరిహద్దుల్లో ఏం జరిగింది... ఎందుకు చైనా విన్నపాలు దిగుతోంది.. అసలు భారత్ సరిహద్దుల్లో  ఎలాంటి వ్యూహం అమలు చేస్తోంది. ఇవన్నీ ఓ సారి తెలుసుకుందాం రండి... సరిహద్దుల్లో అంతా ప్రశాంతంగా వున్న సమయంలో... నిషేధిత భూభాగంలోకి వచ్చి చైనా తిష్ట వేసుకొని కూర్చుంది.




బఫర్ జోన్  లోకి వచ్చే అధికారం ఏ దేశానికి లేదని వెనక్కి వెళ్లాలి అంటూ భారత్ ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ... చైనా మాత్రం సరిహద్దుల్లో డబుల్ గేమ్ ఆడుతూనే ఉంది.  ప్రస్తుతం తాము గుడారాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతం  భారత భూభాగం కాదని... అక్కడ భారత సైన్యం లేదని అందుకే ఈ భూభాగంలోకి వచ్చాము  అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చైనా ప్రభుత్వం. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే పలుమార్లు చైనా భారత్ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొని కొంతమంది సైనికులు మరణించిన విషయం కూడా తెలిసిందే.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దూకుడు పెంచిన భారత్ చైనా కు భారీ షాక్ ఇచ్చింది. పాంగ్వాన్  సరస్సు ప్రాంతంలో  భారత కదలికలను కనిపెట్టేందుకు చైనా అత్యాధునిక కెమెరాలను నిఘా  పరికరాలను ఏర్పాటు చేసిన ఐదు పర్వతాలను ఆధీనంలోకి తీసుకుంది భారత్ . దీంతో చైనాకి భారీ షాక్ తగిలింది.  అది తమ దేశానికి చెందిన భూభాగమని .. దయచేసి ఆక్రమించుకున్న భూభాగం నుంచి వెనక్కి వెళ్ళాలి అంటూ  చైనా విన్నపాలకు  దిగుతుంది. అయితే ఆ భూభాగంలో చైనా సైన్యం లేదు కాబట్టి.. చైనా భూభాగం కాదు కాబట్టి తమ సైన్యం అక్కడికి చేరుకుంది... అంటూ ఎంతో క్యాజువల్ గా  గతంలో చైనా చెప్పిన డైలాగ్ ని రిపీట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. చైనాకు టిట్ ఫర్ టాట్ అనే విధంగా సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: