వెనుక నుంచి వచ్చిన దుండగులు రౌడీ షీటర్ ని కింద పడేసారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన గ్యాంగ్ స్టార్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ అప్పటికే ఐదుగురు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికారు. తలపైనే దాడి చేయడంతో గ్యాంగ్ స్టార్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చివరి శ్వాస తో కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఐతే హత్య కు గురైన గ్యాంగ్ స్టార్ ని రమేష్ బాబు గా పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన నిందితులు అందరూ సుమారు 30-25 ఏళ్ల యువకులైన అని తెలుస్తోంది.
అయితే రౌడీ షీటర్ ని చంపిన అనంతరం ఎనిమిది మంది నిందితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. 2016 సంవత్సరం లో శివ రాజ్ అనే ఒక గ్యాంగ్ స్టార్ ని రమేష్ బాబు చంపి ఉంటాడని... ఆ ప్రతీకారం తోనే అతడి అనుచరులు ఇప్పుడు రమేష్ బాబు ని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను లోతుగా విచారణ చేపట్టారని తెలుస్తోంది. ఏదేమైనా సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి