ఏ చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు వైద్యులు. అయితే ప్రస్తుతం ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ గతంలో కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. వైద్య సిబ్బంది కోసం మార్చి 30వ తేదీన 50 లక్షల బీమా అందరికీ వర్తించేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులు అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న తమకు ఏ క్షణాన ప్రమాదం పొంచి ఉందో తెలియదు కాబట్టి తమకు భీమ కల్పించాలి అంటూ వైద్యులు కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే వైద్యులకు అందిస్తున్న ఈ బీమా పథకం పై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వైద్యులందరికీ అదిరిపోయే శుభవార్త వినిపించింది. మరో ఆరు నెలలపాటు ఈ బీమా పథకాన్ని పొడిగిస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ బీమా ను అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు అరవై ఒక్క క్లెయిమ్ లను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పరిష్కరించగ.. 157 క్లెయిమ్ లు పరిశీలనలో ఉన్నాయి. 67 క్లెయిమ్ లకు సంబంధించిన దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇది వైద్యులందరికీ శుభవార్త అనే చెప్పాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి