అయితే మునుపటిలా కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్య ఈ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిగ్రీ కళాశాల లోనే సెల్ఫ్ సెంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంది తెలంగాణ విద్యా శాఖ. ఇక ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. సెల్ఫ్ సెంటర్ కావడంతో పరీక్షలు రాసేందుకు ఎంతగానో ఉత్సాహం చూపుతున్నారు విద్యార్థులు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎంతలా ఉత్సాహం చూపుతున్నారు అంటే... ఎక్కువ మొత్తంలో విద్యార్థులు పరీక్షలకు హాజరై ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు.
ముఖ్యంగా ఇటీవల నిర్వహించబడిన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు విద్యార్థులు. తొలి రోజు జరిగిన బిఏ,బీకాం,బీఎస్సీ బీబీఈ సహా ఇతర పరీక్షలకు ఏకంగా 97.05 శాతం మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. అయితే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో డిగ్రీ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాయని విద్యార్థులకు మరో రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి