ఈ నేపథ్యంలో బాపట్ల లో టీడీపీ ఇంచార్జి గా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియమించారు చంద్రబాబు.. అయితే ఆయనకు ఇక్కడ కొన్ని సవాళ్లు ఎదురవ్వడం ఖాయం అంటున్నారు.. ఈ పార్లమెంట్ పరిధిలో మూడు నియోజక వర్గాలున్నాయి.. చీరాల, సంతనూతలపాడు, బాపట్ల ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. 1999 నుంచి ఇక్కడ టీడీపీ అస్సలు గెలవలేదంటే ఇక్కడ ఎంత దారుణమైన స్థితిలో పార్టీ ఉందొ అర్థం చేసుకోవచ్చు.. అలాంటి చోట టీడీపీ ని గెలుపు గుర్రం ఎక్కించాలంటే ఏలూరి కి కొంత కష్టమైనా పనే అని అంటున్నారు..
ఈ ఏరియా లో ఇన్నాళ్లు పార్టీ ని సరైన దిశల్లో నడిపే నాయకుడు లేక పార్టీ ఇక్కడ వీక్ అయిపోయిందని క్యాడర్ అంటుంది.. ఈ నేపథ్యంలో ఈ మార్పు కొంత టీడీపీ కి అనుకూలించే అంశంగా చెప్తున్నారు. సంతనూతలపాడు లో గడిచిన రెండు ఎన్నికల్లోనూ బీఎన్ విజయ్‌కుమార్ ఓటమి బాటలో ఉన్నారు. ఆయన్ని మార్చితే తప్పా ఇక్కడ టీడీపీ బాగుపడదు అంటున్నారు.. ఇంకా చీరాలలో కరణం బలరాం గత ఎన్నికల్లో గెలిచి.. పార్టీకి ఊపు తెచ్చారని అనుకునేలోగానే.. ఆయన పార్టీ మారిపోయారు. దీంతో ఇక్కడ పార్టీని మళ్లీ మొదటి నుంచి లైన్‌లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏలూరి ఈ మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో టీడీపీ ని ఎలా బలోపేతం చేస్తారో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి