దుబ్బాక ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌క్రియ అంకం ముగిసింది. అభ్య‌ర్థుల అర్హ‌త‌ల వ‌డ‌పోత‌.. ఉపసంహ‌ర‌ణ‌ల త‌ర్వాత సోమ‌వారం సాయంత్రం బ‌రిలో నిలిచి ఉన్న అభ్య‌ర్థుల పేర్ల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. 46 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా వారిలో 11 మంది ఉపసంహరించుకున్నారు. 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టైంది. మరో 12 నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 23 మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉటుంద‌న్న‌ది తెలిసిందే. 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగ‌డంతో భారీగా ఓట్లు చీలుతాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఈ చీలిక ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థ‌లు గెలుపోట‌ముల‌ను ఖ‌చ్చితంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని నొక్కి చెబుతున్నారు. మూడు పార్టీల మ‌ధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో ఉన్న ప‌రిస్థితుల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు మ‌ళ్లే ఓట్లు ఎవ‌రికి లాభం చేకూరుస్తాయోన‌న్న టెన్ష‌న్ రాజ‌కీయ వ‌ర్గాల్లో రేకెత్తుతోంది. పార్టీ గుర్తులతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, అల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక, జై స్వరాజ్ అభ్యర్థి గౌట్ మల్లేశం, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్, ఇండియా ప్రజా బంద్ పార్టీ అభ్యర్థి సునీల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సుకురి అశోక్ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్ధులుగా అండర్ఫ్ సుదర్శన్, అన్న బుర్ర రవితేజ గౌడ్, అన్న రాజ్, కంటే సాయన్న, కొట్టాల యాదగిరి ముదిరాజ్, కోట శ్యామ్‌కుమార్‌, విక్రమ్‌రెడ్డి వేముల, బండారు నాగరాజ్, పీఎం.బాబు, బుట్టన్నగారి మాధవ రెడ్డి, మోతె నరేష్, రణవేని లక్ష్మణ్‌ రావు, రేపల్లె శ్రీనివాస్, వడ్ల మాధవాచారి, సిల్వెరి శ్రీకాంత్ ఉన్నారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరపున అన్నీతానై మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, నవంబర్‌ 3న, దుబ్బాకలో పోలింగ్‌ జరగనుండగా 10న ఫలితం వెల్లడికానుంది. ర‌ఘునంద‌న్‌రావు, హ‌రీష్‌రావుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుండ‌టంతో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ఇక్క‌డ జ‌రిగేది టీఆర్ ఎస్‌-బీజేపీల మ‌ధ్య  పోరు మాత్ర‌మే...కాంగ్రెస్‌కు బ‌లం లేద‌ని బీజేపీ శ్రేణులు ప్ర‌చారం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. చూడాలి మ‌రి ఏంజ‌రుగుతుందో..?!




మరింత సమాచారం తెలుసుకోండి: