మన తెలుగు రాష్ట్రాల్లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారీ వర్షాలతో రైతులు చాలా వరకు ఇబ్బందులు పెడుతున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పట్లో రైతులు కోలుకునే అవకాశాలు దాదాపు గా లేవు అనే విషయం చెప్పవచ్చు. రైతాంగానికి భారీ వర్షాలు అకాల ముప్పుగా పరిణమించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రైతులకు సహాయం చేసినా సరే అది క్షేత్రస్థాయిలో అందే అవకాశాలు లేక పోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కేంద్రం భావిస్తోంది.

రాజకీయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ... ఇప్పుడు వర్షాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎందుకు ఏంటి అనేది ఒక్కసారి చూస్తే... ఇప్పుడు బీజేపీకి రైతుల మద్దతు అనేది చాలా అవసరం. దీనితో ప్రజలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ప్రజల్లో బీజేపీ మీద చాలా వరకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రత్యేక ప్యాకేజీ కింద దాదాపు 500 కోట్లు ప్రకటించే అవకాశం ఉంది.

ముందుగా తక్షణ సాయం చేసి ఆ తర్వాత కనీసం మూడు వేల కోట్లు అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అందించే అవకాశాలు ఉండవచ్చు. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు మద్దతు ధర విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే బీహార్ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ తో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: