రాష్ట్ర ప్రభుత్వం పేదలకోసం తీసుకొస్తున్న మరో బృహత్తర కార్యక్రమం వైఎస్సార్ బీమా. రైస్ కార్డులు కలిగిన కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. రైస్ కార్డులు లేకపోతే ఈ పథకానికి వారు అనర్హులు. అంటే వైఎస్సార్ బీమా పొందాలంటే వెంటనే మీరు రైస్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనమాట. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.

వైఎస్సార్ బీమా పథకంలోని ముఖ్యాంశాలు..
18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు. లబ్ధిదారుడు ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు.
51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. 18 – 70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు.

వైఎస్సార్‌ బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

వైఎస్సార్ బీమాకు అర్హత కలవారు ముందుగా బ్యాంక్ ఖాతా తెరవైలి. దానికి ఈకేవైసీ చేయించుకుని సచివాలయాన్ని సందర్శించి బ్కాంకు ఖాతా వివరాలు అందిస్తే.. వారు రైస్ కార్డుకి బ్యాంక్ ఖాతాను జోడిస్తారు. ఈ బ్యాంకు ఖాతాలోకి వారం రోజుల్లోగా వైఎస్సార్ బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుంది. ఆ తర్వాత ప్రీమియంను సంబంధిత సంస్థలు డెబిట్ చేసుకుంటాయి. అప్పటినుంచి వారంతా వైఎస్సార్ బీమా పథకానికి అర్హత పొందినట్టు అవుతుంది. అంటే వైఎస్సార్ బీమా పొందడానికి రైస్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అనమాట. ఆ తర్వాత సచివాలయాన్ని సందర్శిస్తే.. వెంటనే పని పూర్తవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: